సమంత కనిపించడం లేదు..!?

By రాణి  Published on  10 April 2020 1:42 PM GMT
సమంత కనిపించడం లేదు..!?

సమంత అక్కినేని..సోషల్ మీడియాలో ఎక్కవ యాక్టివ్ గా ఉండే హీరోయిన్. రీల్ లైఫ్..రియల్ లైఫ్ లో కూడా ఆమె హీరోయినే. అత్త అమలా లాగే సమంత కు కూడా మూగజీవాలంటే అమితమైన ప్రేమ. ఎప్పుడూ ఏదొక పోస్ట్ పెడుతూ ఇన్ స్టా, ట్విట్టర్లలో యాక్టివ్ గా ఉండే సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో వెతుకుదామన్నా కనిపించడం లేదు. ట్విట్టర్ లో మార్చి 17, ఇన్ స్టాలో మార్చి 28న పోస్ట్ లు పెట్టిన ఈ అమ్మడు ఇంతవరకూ సోషల్ మీడియాలో కనిపించలేదు.

Also Read : జియో వినియోగదారుల‌కు గుడ్‌న్యూస్‌.. రీచార్జ్ చేస్తే క‌మీష‌న్‌

ఎప్పుడూ తన వర్కవుట్స్ గురించి, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ చెప్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఇప్పుడు కనిపించడం లేదంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా..తన భర్త నాగ చైతన్యతో, కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో గానీ..సోషల్ మీడియా వైపు కన్నెత్తి చూడట్లేదు. సమంత లాగే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ..కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

Next Story
Share it