హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దమ్మ గుడి మెట్రోస్టేషన్‌పై నుంచి ప్లాస్టిక్‌ పైప్‌ ఊడిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైపు ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే పైపులు ఊడిపడటం చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మెట్రో అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన మరమ్మతులు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

Metro Staion 1.jpg2

గత నెలలో కూడా అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ దగ్గర మౌనిక అనే టెక్కీ మృతి చెందిన సంగతి తెలిసిందే. వాన పడుతున్నదని మెట్రో స్టేషన్‌ కిందకు వచ్చిన మౌనికపై పెచ్చులూడి పడి అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత మెట్రో అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మెట్రో స్టేషన్ల స్థితిగతులపై మంత్రి కేటీఆర్‌ నివేదిక కూడా కోరారు. మూన్నాళ్ల ముచ్చటగా మరమ్మతులంటూ హడావిడి చేసిన మెట్రో అధికారులు తర్వాత సైలెంట్‌ అయిపోయారు. ఇప్పటికైనా మెట్రో అధికారులు మేల్కొని మెట్రోస్టేషన్ల స్థితిపై దృష్టి పెడితే మంచిది.

Metro Staion 1.jpg3

https://www.youtube.com/watch?v=bPoX3GUcMe0

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story