జనశక్తి మాజీ నేత చంద్రన్న మృతి
By సుభాష్ Published on 13 Dec 2019 10:11 AM IST
జనశక్తి మాజీ నేత చంద్రన్న (75) అనారోగ్యంతో మృతి చెందాడు. కొంత కాలంగా డయాబెటిక్, శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్న చంద్రన్న.. ఇటీవల అస్వస్థకు గురికావడంతో హైదరాబాద్‌లోని విద్యానగర్ ఆంధ్ర మహాసభ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో మరణించారు.
యాదాద్రి జిల్లా టంగుటూర్ గ్రామానికి చెందిన చంద్రన్న ఈసీఐఎల్ ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగం చేసే సమయంలో విప్లవ కార్మిక సంఘాలతో పరిచయం ఏర్పడి భారత కార్మిక సంఘాల సమాఖ్య, జనశక్తిల రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. బీడీ, సింగరేణి కార్మికుల అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాంనగర్‌లోని స్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Next Story