మహారాష్ట్ర, హర్యానాల్లో కాషాయ జెండా రెపరెపలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 2:02 PM GMT
మహారాష్ట్ర, హర్యానాల్లో కాషాయ జెండా రెపరెపలు..!

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయిపోగానే వివిధ జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ ఫోల్స్ ప్రకటించాయి. ప్రధాన జాతీయ ఛానళ్లు అన్నీ మహారాష్ట్రలో బీజేపీకే ఓటేశాయి. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. భారతీయ జనతా పార్టీని మోదీ, అమిత్ షాలే ముందుండి నడిపించారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీనే అధికారంలోకి వస్తాయని ప్రకటించాయి. మహారాష్ట్ర ఎన్నికలపై వివిధ జాతీయ ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ చూద్దాం.

టైమ్స్ నౌ సర్వే :288 సీట్లలో బీజేపీ 230 సీట్లు గెలుచుకుంటే.. కాంగ్రెస్ కేవలం 48 సీట్లకే పరిమితం అవుతుంది. ఇక..ఇతరులు 10 సీట్లు గెలుచుకుంటారు.

ఇండియా టుడే: ఇండియా టుడే 166 నుంచి 194 సీట్లు బీజేపీకి ఇచ్చింది. కాంగ్రెస్ 72 - 90 సీట్లు గెలవచ్చని చెప్పింది. ఇండియా టుడే అంచనా ప్రకారం ఇతరులు 22 - 34 సీట్లు గెలుచుకునే అవకాశముంది.

సీఎన్‌ఎన్ న్యూస్ 18 : సీఎన్‌ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ ఏకంగా 243 సీట్లు గెలుచుకునే అవకాశముంది. కాంగ్రెస్ కేవలం 41 సీట్లకు పరిమితం అవుతుంది. ఇతరులు కేవలం 4 సీట్లు గెలుచుకునే అవకాశముంది.

రిపబ్లిక్ టీవీ: ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 223 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ 54 సీట్లు కైవసం చేసుకుంటుంది. అదర్స్ కేవలం 4 సీట్లకే పరిమితం అవుతున్నారు.

ఏబీపీ న్యూస్ : ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 209 సీట్లు కైవసం చేసుకుంటుంది. కాంగ్రెస్ 69 స్థానాలు గెలచుకుంటుంది. అదర్స్ 15 సీట్లకు పరిమితం అవుతారు.

ఐదు ఎగ్జిట్ పోల్స్‌లో ఇండియా టుడే మినహాయిస్తే మిగతా అన్నీ బీజేపీకి 200 సీట్లకు పైగానే ఇచ్చాయి. ఇక..సీఎన్‌ఎన్‌ న్యూస్ 18 ఏకంగా 243 సీట్లు ఇచ్చింది. అన్ని జాతీయ ఛానళ్ల ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

Maharastra New

హర్యానాలోనూ బీజేపీ హవానే..!

ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం..హర్యానాలోనూ కమలం వికసించనుంది. హర్యానాలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. బీజేపీ 51 శాతం ఓట్లతో 71 నుంచి 77 సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వెలువడ్డాయి. ఇక..కాంగ్రెస్ 20.11 శాతం ఓట్లతో కేవలం 5 నుంచి 9 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశముంది. జేజేపీ 17.55 శాతం ఓట్లతో 5 నుంచి 7 సీట్లు, బీఎస్పీ 3.20 శాతం ఓట్లతో ఒక సీటు. ఇక ..ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2.83 శాతం ఓట్లతో ఒక సీటుకే పరిమితం కానుంది.

Haryana 1

Haryana2

Harana New

ఇక ..మ్యాండెట్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. హర్యానాలో బీజేపీ మళ్లీ అధికారం దక్కించుకుంటుంది. బీజేపీ 46.2 శాతం ఓట్లతో 71 సీట్లు గెలుచుకోనుంది. కాంగ్రెస్ 22.8 శాతం ఓట్లతో 11 సీట్లకే పరిమితం అవుతుంది. ఇక..జేజేపీ 9 శాతం ఓట్లతొ 5 సీట్లు గెలచుకుంటుంది. ఇతరులు..22 శాతం ఓట్లు గెలుచుకున్నప్పటికీ 3 సీట్లు దగ్గరే ఆగిపోతున్నారు.

Next Story