తెనాలి టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఎక్సైజ్ దాడులు
By రాణి Published on 13 March 2020 6:25 PM ISTముఖ్యాంశాలు
- టెర్రస్ పై లభ్యమైన మందు సీసాలు
- అభ్యర్థి బంధువుని అదుపులోకి తీసుకున్న అధికారులు
- వైసీపీ కుట్రేనని ఆరోపిస్తున్న చంద్రబాబు
- పట్టించుకోని పోలీసులు
- సీసీ ఫుటేజ్ లో బయటపడిన నిజం
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు..వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపాయి. నిన్న గాక మొన్న వైసీపీ అభ్యర్థులు బుద్ధా వెంకన్న కారుపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడి సమయంలో వారు చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకున్నారు. కానీ..వారితోపాటే ఉన్న లాయర్ కు మాత్రం తీవ్రగాయమైంది. తాజాగా..తెనాలిలో నాల్గవ వార్డు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఇంటిలో ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు చేయగా..మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ఇవి ఎందుకు ఇంటిలో ఉన్నాయి అని..అధికారులు ఇంట్లోని వారిని ప్రశ్నించగా..తనకేమీ తెలియదని చెప్పారు. అనుమానం వచ్చి ఇంటి ప్రాంగణంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా..ఎవరో ఒక వ్యక్తి గోడ దూకి దొంగ చాటుగా మద్యం సీసాలను అభ్యర్థి ఇంటిపై ఉంచినట్లు వెల్లడైంది. కాగా..ఆ వ్యక్తి ముఖానికి ఒక క్లాత్ కట్టుకోవడంతో అతనెవరన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
Also Read : అనసూయ, రష్మీలకు పోటీగా రాములమ్మ
అయితే..రాత్రి మద్యం సీసాలు పెడితే..తెల్లవారేసరికి అధికారులు తనిఖీలు చేసేందుకు రావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. నేరుగా డాబా పైకి వెళ్లి అక్కడ మద్యం సీసాలు తీసుకోవడం వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. కాగా..తనిఖీల సమయంలో అభ్యర్థి ఇంట్లో లేకపోవడంతో..అతని బంధువును ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : ఏపీ శాసన మండలి రద్దుకు సంకేతాలివేనా..?
మరోవైపు ఈ విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో అక్రమంగా మద్యం సీసాలు పెట్టారంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎక్సైజ్ సిబ్బందికి ఎవరూ చెప్పకుండానే నేరుగా మద్యం ఉంచిన చోటుకే వెళ్లడం అనుమానాలు కలిగిస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో మద్యం సీసాల ఘటనపై టీడీపీ అభ్యర్థి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలతో పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది చేతులు కలిపినట్లుగా చంద్రబాబు ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు.
[playlist type="video" ids="36400"]