జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా సినీ కెరీర్ మొదలు పెట్టి..పటాస్ షో తో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకుంది శ్రీముఖి. అలా అలా బుల్లితెర యాంకర్ గా సెటిల్ అయిపోయింది. జులాయి లో రాజీగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో సోనియాగా, ప్రేమ ఇష్క్ కాదల్ లో శాంతిగా, తమిళంలో వచ్చిన Ettuthikkum Madhayaanaiలో సరహ్ గా, చంద్రికలో శిల్ప గా, ధనలక్ష్మీ తలుపు తడితే సినిమాలో చిత్ర గా, ఆంధ్ర పోరి సినిమాలో స్వప్నగా, నేను శైలజ లో రామ్ కు అక్క(స్వేచ్ఛ)గా, సావిత్రి సినిమాలో బేబీ గా, జెంటిమెన్ లో నిత్య(జర్నలిస్ట్)గా మనలో ఒకడు, బాబు బాగా బిజీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులతో పాటు అడపా దడపా కన్నడ, తమిళ ప్రేక్షకులనూ అలరించిందీ బొద్దుగుమ్మ..సారీ సారీ..ఇప్పుడిప్పుడే ముద్దుగుమ్మలా అవుతోంది. కెరీరో మొదట్లో కాస్త సంప్రదాయంగానే కనిపించిన ఈ నిజామాబాద్ పోరీ..ఇప్పుడు క్లీవేజ్ షో లు ఇస్తూ..యువతను కట్టిపడేస్తోంది.

Also Read : నితిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ కు బ్రేకులు..ఎందుకంటే

ఒకప్పుడు బుల్లితెర యాంకర్లు చాలా సంప్రదాయంగా..కట్టు బొట్టుతో అందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒక్క సుమ తప్ప..ప్రస్తుతం బుల్లితెర రాజ్యాన్నేలుతున్న యాంకర్లంతా అందాల ఆరబోతలో డోస్ పెంచేశారు. బిబ్ బాస్ 3 నుంచి వచ్చాక..శ్రీముఖికి పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. శ్రీముఖి ఒక షో ను హోస్ట్ చేయాలన్నా, ఒక ఈవెంట్ కు హోస్ట్ చేయాలన్నా లక్షల్లో పారితోషికం తీసుకుంటుందని టాక్. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్ స్టార్ మ్యూజిక్ రీలోడెడ్, జెమినీ టీవీలో ప్రసారమయ్యే సెలబ్రిటీ కబడ్డీ లీగ్ లో యాంకర్ గా చేస్తోంది.

Also Read : కరోనాను చైనా అదుపు చేసిందిలా..

అంతకుముందు ఈటీవీలో ప్రసారమైన అదుర్స్, అదుర్స్ 2, మాటీవీలో మనీ మనీ, సూపర్ సింగర్ 9, భలే ఛాన్స్ లే, జెమినీలో జూ లకటక, జూ లకటక డబుల్ డోస్, జీ తెలుగులో కామెడీ నైట్స్, సూపర్ మామ్, సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్, జీ సరిగమప, ఈటీవీ ప్లస్ లో పటాస్ షోలకు శ్రీముఖి యాంకర్ గా చేసింది.

Also Read : బిగ్‌బాస్‌-4 : షో హోస్ట్‌గా మహేశ్‌ బాబు..!

ఇప్పుడీ రాములమ్మ..జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్లుగా ఉన్న రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ లకు పోటీ వస్తోంది. అప్పుడప్పుడూ క్లీవేజ్ ఫొటో షూట్ చేస్తూ..అందాల ఆరబోతలో తానేం తక్కువకాదని చెప్పకనే చెప్తోంది. మొదట్లో అందాల ఆరబోతల్లో పోటీ పడిన రష్మీ, అనసూయ..ఇక తమకెవరూ పోటీ లేరనుకుని ఇప్పుడిప్పుడే కాస్త ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్నారు. అంటే అప్పుడప్పుడూ చీరకట్టులో కూడా కనిపిస్తున్నారు. అలాగని వాళ్లని తీసిపారేయలేం. వాళ్లకు క్రేజ్ తగ్గుతుందని ఏమాత్రం అనిపించినా మళ్లీ డోస్ పెంచేస్తారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.