ముఖ్యాంశాలు

  • రోజుకు 9 పని గంటలు
  • వారం ఒక రోజు సెలవు దినం కావడంతో కేంద్రం నిర్ణయం
  • ఉద్యోగులు, కార్మికులు ఈ మెయిళ్ల ద్వారా అభిప్రాయం చెప్పొచ్చన్న కేంద్రం

ఢిల్లీ: ఇక నుంచి కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చేవారు రోజుకు 9 గంటలు పని చేయాలి. దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్రం జారీ చేసింది. వారంలో ఒక రోజు సెలవు దినం కావడంతో..రోజుకు 9గంటలు పని చేయాలనే నిబంధనను కేంద్రం తీసుకొచ్చింది. అయితే..కనీస వేతనం ఎంత అనే దానిపై కేంద్ర నిబంధనల్లో లేదు. వేతనాలను నిర్ణయించడానికి మాత్రం ఆరు ప్రమాణాలను సూచించారు. కేంద్రం నిర్ణయంపై ఉద్యోగులు, కార్మికులు ఈ మెయిళ్ల ద్వారా తమ అభిప్రాయం చెప్పొచ్చు. పని గంటలు పెరిగినంత మాత్రానా శాలరీలు పెరుగుతాయనే గ్యారంటీ లేదు. ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాల ఉద్యోగులు, కార్మికులు వ్యతిరేకించే అవకాశముంది. అయితే..తుది నిర్ణయం మాత్రం కేంద్రానిదే.

Image result for CORPORATE OFFICES EMPLOYES INDIA

వేతనం నిర్ఠయించే సమయంలో 25 శాతం విద్య, వైద్యం, పిల్లల వినోదాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణమయించాలని నిబంధనల్లో కార్మిక శాఖ పేర్కొంది. ఇక..ఇప్పటికీ 1957 విధానాన్నే అమలు చేస్తున్నారు. పాత చట్టాల బూజు దులుపుతున్న మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాల వేతన నిబంధనలు ఎందుకు కొత్తవి రూపొందించడంలేదో అర్ధం కావడం లేదు.

Related image

అయితే…కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముంది. ఒక వేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లాలి అనుకుంటే జీతాలు పెంచాలని కూడా ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేయవచ్చు. మొత్తానికి 9 గంటల పని విధానం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశం కానుంది.

Related image

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.