చెప్పేవాళ్లు ఎన్నైనా చెబుతారు..అవి గాలి వార్తలు..!: మంత్రి ఈటల రాజేందర్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Nov 2019 6:31 PM ISTముఖ్యాంశాలు
- పార్టీ మారే ప్రసక్తే లేదు : మంత్రి ఈటల
- తెలంగాణలొ చిన్న పిల్లలు, తల్లుల మరణాలు తగ్గాయి
- ఆదిలాబాద్, వరంగల్ ల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నానన్న వార్తలను టీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఖండించారు. అవన్నీ పనిలేని వాళ్లు చేసే ప్రచారమన్నారు. అవి గాలి వార్తలంటూ మంత్రి రాజేందర్ కొట్టిపారేశారు.
తెలంగాణలో ఆరోగ్య సేవలు భేష్
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఆరోగ్య సేవలు మెరుగయ్యాయన్నారు మంత్రి ఈటల రాజేందర్. చిన్న పిల్లల మరణాలు 39 నుంచి 28 కి తగ్గాయి అన్నారు. తల్లుల మరణాలు కూడా చాలా వరకు తగ్గాయని చెప్పారు. మెడికల్ కాలేజీలు,డాక్టర్ల సంఖ్య పెంచామన్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో 9చోట్ల జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేశామన్నారు. హైవే లపై ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ట్రామ కేర్ సెంటర్ లాంటివాటిని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ మెరుగైందన్నారు. వరంగల్, ఆదిలాబాద్ ల్లో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. అన్ని వైద్య విధాన ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.
మెరుగైన వైద్యాన్ని పేదలకు అందించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు.