హైదరాబాద్ లో కజకిస్థాన్ కాన్సులేట్ ఏర్పాటు

By రాణి  Published on  13 Dec 2019 7:22 AM GMT
హైదరాబాద్ లో కజకిస్థాన్ కాన్సులేట్ ఏర్పాటు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సత్సంబంధాలను పెంచుకోవాలని ఆలోచిస్తున్న కజక్ స్థాన్ తెలంగాణలో తమ దేశ కాన్సులేట్ ని ఏర్పాటు చేస్తోంది. మరో రెండు వారాల్లో దీనికి సంబంధించిన విధివిధానాలు పూర్తి స్థాయిలో ఖరారు కాబోతున్నాయి. కజక్ స్థాన్ దౌత్యవేత్త ఎర్లాన్ అలింబాయేవ్ ఇందుకోసం త్వరలో భారత్ కు రాబోతున్నారు. ఈయన తనతో పాటుగా కొందరు కజక్ స్థాన్ పెట్టుబడిదారుల్ని వెంటబెట్టుకుని మరీ వస్తున్నారు. రెండేళ్లుగా భారత్ తో ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సంబంధాలు సజావుగా ఉన్నాయని కజక్ స్థాన్ వాసులు అంటున్నారు. $1.2 బిలియన్ డాలర్లనుంచి $1.25 బిలియన్ డాలర్ల వరకూ దీన్ని ఈ ఏడాది పెంచేందుకు రెండు ప్రభుత్వాలూ ఆలోచిస్తున్నాయి.

మైనింగ్, ఆయిల్ రిఫైనరీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కజక్ స్థాన్ ముందుకొస్తుంది. కజక్ స్థాన్ కు వెళ్లాలనుకునే యాత్రికుల సంఖ్య ప్రతి ఏడాది 40 శాతం పెరుగుతూ వస్తోంది. గత ఏడాది 25 వేల మంది కజక్ స్థాన్ పౌరులు వైద్యంకోసం భారత్ కు వచ్చారు.

మ్యాక్ ప్రాజెక్ట్స్ మ్యానేజింగ్ డైరెక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ ను భారత్ లో ఏర్పాటు చేయబోతున్నఆనరరీ కౌన్సిల్ కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నతాధికారిగా నియమిస్తున్నట్లుగా కజక్ స్థాన్ అధికారులు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రత్యేక బృందం రాబోయే రోజుల్లో కజకిస్థాన్ లోని లొకేషన్లను పరిశీలించేందుకు త్వరలోనే కజక్ స్థాన్ లో పర్యటించబోతోంది.

Next Story