ఆ తర్వాత కేటీఆరే సీఎం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు.!

By Newsmeter.Network  Published on  2 Jan 2020 2:53 PM IST
ఆ తర్వాత కేటీఆరే సీఎం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు.!

వరంగల్‌ రూరల్‌: కేటీఆర్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయని రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కేటీఆర్‌ నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించామని పేర్కొన్నారు. కేటీఆర్‌ సీఎం ఎప్పుడవుతారో కేసీఆర్‌ నిర్ణయిస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాహుల్‌ గాంధీ, లోకేష్‌లా కేటీఆర్‌ అసమర్థుడు కాదన్నారు. దేశానికి సాతంత్ర్యం తెచ్చిన నెహ్రు కుటుంబం ప్రభుత్వాన్ని నడిపినప్పుడు.. రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చిన కేసీఆర్‌ కుటుంబం ఎందుకు పాలించొద్దు అంటూ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యనించారు.

వర్దన్నపేట మండలం దమ్మన్నపేటలో పల్లెప్రగతి రెండో దశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, నేతలు, పలు శాఖల అధికారులు హాజరైనారు. గ్రామాల అభివృద్ధి కోసమే పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టామని, హరితహారంతో గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ఎర్రబెల్లి అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌, నేతలు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్రజ్యోతి, పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ ఎం.రఘునందన్‌రావు, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, పలు శాఖల అధికారులు హాజరైనారు. గ్రామాల అభివృద్ధి కోసమే పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టామని, హరితహారంతో గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ఎర్రబెల్లి అన్నారు. రెండో విడత పల్లె ప్రగతిని సమిష్టిగా విజయవంతం చేయాలని కోరారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే నీళ్లు, కరెంట్‌ రావని అన్నవాళ్లు మాటలు అబద్దమని కేసీఆర్‌ నిరూపించారన్నారు. గ్రామాల కోసం ఉరిలో పుట్టిన ప్రతి బిడ్డ ఒక రోజు శ్రమదానం చేయాలన్నారు. చెత్తను బయట వెయొద్దని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు సూచించారు.

Next Story