డిస్ట్రిక్ట్ యాప్ సినిమా ప్రియుల కోసం కొత్త ఆఫర్ ను తీసుకుని వచ్చింది. డిస్ట్రిక్ట్ పాస్ అనే కొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది, ఇది వినియోగదారులకు 199కే అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అసలు ధర ₹999 నుండి ఏకంగా 199 రూపాయలకు తగ్గించ్చారు.
డిస్ట్రిక్ట్ యాప్ కొత్త ఆఫర్‌ను పరిచయం చేసింది. అందులో భాగంగా 3 ఉచిత సినిమా టిక్కెట్లు ఉన్నాయి. కనీసం రెండు టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు బుకింగ్‌కు ఒక ఉచిత టికెట్ అందిస్తారు. అంతే కాకుండా 250 విలువైన 2 డైనింగ్ వోచర్లు. యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు సినిమా స్నాక్స్‌పై 20% తగ్గింపు లభిస్తుంది. ఎంపిక చేసిన ఈవెంట్‌లకు ముందస్తు యాక్సెస్ ఇవ్వనున్నారు.
ఈ ఆఫర్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ NCR, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుండి మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో జాబితా చేసిన నిబంధనలు, షరతులకు లోబడి ఈ ఆఫర్ ఉంటుంది.