న‌టితో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. న‌టుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహ‌రా అరెస్టు

న‌టి కంచన్ బామ్నే చేసిన వేధింపుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు న‌టుడు, తెలుగు యూట్యూబర్ ప్రసాద్ బెహ‌రాను అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  18 Dec 2024 7:30 PM IST
న‌టితో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. న‌టుడు, యూట్యూబర్ ప్రసాద్ బెహ‌రా అరెస్టు

న‌టి కంచన్ బామ్నే చేసిన వేధింపుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు న‌టుడు, తెలుగు యూట్యూబర్ ప్రసాద్ బెహ‌రాను అరెస్టు చేశారు. పెళ్లివారమండి, మెకానిక్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌ల‌ సమయంలో ప్రసాద్ బెహ‌రా తనతో పలుమార్లు అనుచితంగా ప్రవర్తించాడని కంచన్ తన ఫిర్యాదులో పేర్కొంది.

కాంచన్ తన ఫిర్యాదులో “పెళ్లివారమండి షూటింగ్ స‌మ‌యంలో అతడు నన్ను అనుచితంగా తాకాడు.. నాకు అసౌకర్యంగా అనిపించింది.. నేను సిరీస్ నుండి తప్పుకున్నాను.. కానీ ఒక సంవత్సరం తర్వాత.. నేను అతనితో మెకానిక్ అనే ప్రాజెక్ట్ కోసం పని చేయడం ప్రారంభించాను.. అతని ప్రవర్తన అలాగే ఉందని వివ‌రించింది. డిసెంబర్ 11, 2024న జూబ్లీహిల్స్‌లోని ఒక ఫ్లాట్‌లో షూటింగ్ సమయంలో అస‌భ్యంగా తాకాడ‌ని ఫిర్యాదులో పేర్కొంది. ప్రసాద్ మొత్తం సిబ్బంది ముందు నా వీపుపై కొట్టాడు. ఎందుకు అలా చేశావ‌ని అడిగితే.. స‌రైన స‌మాధానం చెప్ప‌లేదు. దీంతో సెట్‌లోని ఇతరులు నవ్వారు." బెహ్రా తన స్వరూపం, వయస్సు, పాత్ర గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశాడని ఆమె ఆరోపించింది.

ఫిర్యాదు మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ బి. హరీశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసి, ప్రసాద్‌ను డిసెంబర్ 14న అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. "మేము ఫిర్యాదును స్వీకరించిన వెంటనే చర్యలు తీసుకున్నాం. నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్టు చేసాము" అని ఎస్ఐ చెప్పారు. షూటింగ్ లొకేషన్‌లో ఉన్న సాక్షుల నుండి మరిన్ని ఆధారాలు, వాంగ్మూలాలను సేకరించే విష‌య‌మై దర్యాప్తు జరుగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story