ఎన్టీఆర్ కు కరోనా.. అభిమానుల్లో ఆందోళన

Jr NTR tests corona positive.టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తారక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

By Medi Samrat  Published on  10 May 2021 10:25 AM GMT
Jr NTR

టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తారక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అయితే ఎవరు కూడా టెన్షన్ పడకండి అని చెప్పారు. ప్రస్తుతానికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. నేను, నా కుటుంబం ఐసోలేషన్ లో ఉన్నామని.. వైద్యులు చెప్పిన అన్ని సలహాలను పాటిస్తూ ఉన్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో తనకు దగ్గరగా వచ్చిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

'I've tested positive for Covid19. Plz don't worry,I'm doing absolutely fine. My family & I have isolated ourselves & we're following all protocols under the supervision of doctors. I request those who've come into contact with me over the last few days to pl get tested. Stay safe' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టుల్లో ఎన్టీఆర్ నటించబోతూ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ టీమ్ కరోనా జాగ్రత్తలపై ఓ వీడియో అప్లోడ్ చేసింది. ఇంతలో ఎన్టీఆర్ కు కరోనా అనే వార్త పలువురిని కలవరపెడుతూ ఉంది. తారక్ తొందరగా కోలుకోవాలని పలువురు అభిమానులు, ప్రముఖులు ఆకాంక్షిస్తూ ఉన్నారు. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతూ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడడంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు.

Next Story