బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన యంగ్ హీరో

Young hero Roshan new film look released.నిర్మ‌లా కాన్వెంట్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు రోష‌న్‌. తండ్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2022 6:54 PM IST
బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన యంగ్ హీరో

'నిర్మ‌లా కాన్వెంట్' చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు రోష‌న్‌. తండ్రి శ్రీకాంత్ న‌ట‌నా వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. తొలి చిత్రం త‌రువాత కొంత విరామం తీసుకుని 'పెళ్లి సంద‌D' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే.. ఈ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయినా.. రోష‌న్ న‌టన‌, లుక్స్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. తొంద‌ర ప‌డ‌కుండా ఆచితూచి చిత్రాల‌ను ఎంపిక చేసుకుంటున్నాడు. తాజాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు.

రోష‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అత‌డికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. ఓపోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. తాజాగా విడుదలైన పోస్టర్ లో రోషన్ బ్యాక్ పోజ్‏లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ ప్ర‌దీప్ అదైత్వం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స్వ‌ప్నా సినిమాస్ ఈ మూవీకి స‌హా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. కాగా.. హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా శ్రీకాంత్ త‌న‌యుడు భారీ విష‌యాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.

Next Story