'ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని'.. పొలిటికల్ హీట్ పెంచుతున్న యాత్ర-2 పోస్టర్
Yatra 2 First poster, release date, crew of Mahi V Raghav’s biopic on AP CM Jagan out. ఓటీటీలో విడుదలైన సేవ్ ది టైగర్స్, షైతాన్ వెబ్ సిరీస్‌లతో దర్శకుడు మహీ వీ రాఘవ్ ఇటీవల వార్తల్లో నిలిచాడు
By Medi Samrat Published on 2 July 2023 3:15 PM ISTఓటీటీలో విడుదలైన సేవ్ ది టైగర్స్, షైతాన్ వెబ్ సిరీస్‌లతో దర్శకుడు మహీ వీ రాఘవ్ ఇటీవల వార్తల్లో నిలిచాడు. రెండూ సిరీస్‌లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో దర్శకుడు మహీ వీ రాఘవ్ తన ప్యూచర్ ప్రాజెక్ట్‌పై దృష్టి కేంద్రీకరించాడు. గత ఎన్నికల వేళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రపై 'యాత్ర' సినిమాను తెరకెక్కించిన మహీ.. తాజాగా ఏపీ సీఎం జగన్ బయోపిక్ 'యాత్ర-2' ను సిల్వర్ స్క్రీన్‌పై చూపేందుకు సిద్ధమయ్యాడు.
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నుంచి వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే వరకు ఎదుర్కొన పరిస్థితులను.. జగన్ పాదయాత్రను హైలెట్ చేస్తూ.. యాత్ర 2 సినిమాను తెరకెక్కించబోతున్నారు. యాత్ర 2 కోసం వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. జూన్ 8న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వలన అది వాయిదా పడింది.
“నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి... నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని”#Yatra2 @ShivaMeka @3alproduction @vcelluloidsoffl pic.twitter.com/c0vY04iF1p
— Mahi Vraghav (@MahiVraghav) July 1, 2023
శనివారం నాడు అనూహ్యంగా ‘యాత్ర 2’ పోస్టర్ బయటకు వచ్చింది. సినిమాలో తమిళ హీరో, రంగం ఫేం జీవా లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో సినీ వర్గాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టర్‌పై ఉన్న 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ.. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అన్న డైలాగ్ మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతోపాటు తెలుగు రాజకీయాలలో హాట్ టాఫిక్‌గా మారింది. మాట తప్పను.. మడమ తిప్పను అంటూ దూకుడుగా రాజకీయం చేశారు రాజశేఖర్ రెడ్డి. ఆయన తనయుడిగా.. తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం జగన్ కూడా అంతే దూకుడుగా ముందుకెళ్లారు. అధిష్టానం, ప్రత్యర్ధి పార్టీలు ఎన్ని తిప్పలు పెట్టినా ఓర్పుతో, ఒంటరిగా పోరాడి గెలిచి నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు చూపించనున్నారనే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
అలాగే పిబ్రవరి 24న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ పోస్టర్‌లో ప్రకటించింది. ‘యాత్ర 2’ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించనున్నారు. సంతోష్ నారాయణన్ గతంలో దసరా సినిమాకు మ్యూజిక్ అంధించారు. ఈ సినిమాను యూవీ పిక్చర్ బ్యానర్ తెరకెక్కిస్తుంది.