100 కోట్ల 'బేబీ' గా మారబోతోందా?

Will Baby movie join the 100 Crores club at the box office. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ' సినిమాకు అద్భుతమైన బాక్సాఫీస్ రన్‌ కొనసాగుతూ ఉంది.

By Medi Samrat  Published on  24 July 2023 8:30 PM IST
100 కోట్ల బేబీ గా మారబోతోందా?

సాయి రాజేష్ దర్శకత్వం వహించిన 'బేబీ' సినిమాకు అద్భుతమైన బాక్సాఫీస్ రన్‌ కొనసాగుతూ ఉంది. ఇదే అందరినీ షాక్ చేసింది. భారీ కలెక్షన్లతో ఈ చిత్రం రెండు వారాలు ముగిసినా కూడా అదే జోరును కొనసాగిస్తోంది. అనేక కేంద్రాలలో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు కాలేజీ యూత్. సినిమాలోని పాటలు కూడా హిట్ అవ్వడంతో దాదాపు మీడియం-బడ్జెట్ చిత్రాలతో సమానంగా అద్భుతమైన కలెక్షన్స్ ను సినిమా సాధించింది.

బేబీ సినిమా 100 కోట్ల మేజికల్ ఫిగర్‌ను చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రం ఇప్పటి వరకు 65 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం హౌస్‌ఫుల్ షోలను నమోదు చేసింది. ట్రెండ్‌ని బట్టి చూస్తే ఈ సినిమా దాదాపు 90 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేస్తుందని, మరో 2 వారాలు ఈ సినిమా మంచి రన్‌ను సాధిస్తే కచ్చితంగా 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ వారం బ్రో సినిమా విడుదల అవుతూ ఉండడంతో బేబీకి కాస్త కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. ఇక బ్రో సినిమా టికెట్లు దొరకని వాళ్లు మరో ఆప్షన్ గా బేబీకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.

వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నాగ బాబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుండి మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం యువతను ఆకర్షించింది. సినిమా విడుదలకు ముందే గొప్ప బజ్ క్రియేట్ చేసింది.


Next Story