నాని 'సరిపోదా శనివారం' రిలీజ్‌ ఎప్పుడంటే?

వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌లో నేచురల్‌ స్టార్‌ నాని 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ వచ్చింది.

By అంజి  Published on  10 Dec 2023 1:00 PM IST
Nani, Saripoda Sanivaram, Tollywood, SJ Surya

నాని 'సరిపోదా శనివారం' రిలీజ్‌ ఎప్పుడంటే?

వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌లో నేచురల్‌ స్టార్‌ నాని 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో 'అంటే సుందరానికి' సినిమా వచ్చింది. దీంతో ఈ సినిమాపై నాని ఫ్యాన్స్‌కు క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతోందనేది నాని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై హీరో నాని క్లారిటీ ఇచ్చారు. తన తాజా చిత్రం 'హాయ్ నాన్న' ప్రమోషన్ లో భాగంగా అమెరికా వెళ్లిన ఆయన అక్కడ వారితో మాట్లాడుతూ... ఆగస్ట్ 2024కు ఈ సినిమా విడుదలకు రెడీ చేస్తామని చెప్పుకొచ్చారు.

ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా మాస్, యాక్షన్ మోడ్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన 'హాయ్‌ నాన్న' ఈ నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Next Story