Viral Video : బాలకృష్ణకు షాకిచ్చిన బ‌న్నీ కూతురు

అన్‌స్టాపబుల్ విత్ NBK' కు సంబంధించిన ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ సందడి చేస్తున్నారు.

By Kalasani Durgapraveen  Published on  19 Nov 2024 8:03 PM IST
Viral Video : బాలకృష్ణకు షాకిచ్చిన బ‌న్నీ కూతురు

అన్‌స్టాపబుల్ విత్ NBK' కు సంబంధించిన ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ సందడి చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ ఇప్పటికే ఆహాలో అందుబాటులో ఉండగా.. రెండో ఎపిసోడ్ కు సంబంధించి పిల్లలు, కొడుకు అయాన్, కుమార్తె అల్లు అర్హాతో సందడి చేయబోతున్నాడని కొత్త ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ ప్రోమోలో హోస్ట్ నందమూరి బాలకృష్ణ పిల్లలతో ముచ్చటించారు.

అర్హను స్కూల్ గురించి, ఆమె ఏ క్లాస్‌లో ఉందనే విషయాలను బాలయ్య తెలుసుకున్నారు. బాలకృష్ణ ఆమెకు తెలుగు మాట్లాడటం తెలుసా అని అడిగాడు. వెంటనే తెలుగులో అర్హ చెప్పే పద్యం విని బాలయ్య షాక్ అయిపోయారు. "అటజని కాంచె..." అంటూ తెలుగు పద్యాన్ని అలవోకగా పలకడం ఈ ప్రోమో వీడియోలో చూడొచ్చు. వెంటనే ఆర్హ చెంపపై ముద్దు పెట్టారు బాలయ్య. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. అల్లు ఆర్హ తెలుగులో ఎంతో కష్టమైన పద్యాన్ని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులను తెగ మెచ్చుకుంటూ ఉన్నారు.

Next Story