బాక్సాఫీస్ వద్ద 'వార్-2' విధ్వంసం

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ సీక్వెల్ వార్-2 ఈ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

By Medi Samrat
Published on : 16 Aug 2025 1:34 PM IST

బాక్సాఫీస్ వద్ద వార్-2 విధ్వంసం

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ సీక్వెల్ వార్-2 ఈ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండేవి. ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందని ఇప్పటికే అంచనా వేశారు. ఇప్పుడు సినిమా విడుద‌లై అంచ‌నాల‌ను అందుకుంది. వార్ విడుదలైన ఆరేళ్ల తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ స్థానంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సీక్వెల్ వార్ 2 వచ్చింది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

కేవలం రెండు రోజుల్లోనే ఇండియాలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. వార్-2 మొదటి రోజు 51.5 కోట్ల బిజినెస్ చేయగా, రెండవ రోజు 56.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో టోటల్ కలెక్షన్ రూ.108 కోట్లు క‌లెక్ట్ చేసి 100కోట్ల క్ల‌బ్‌లో చేరింది.

బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. వార్ 2 మొదటి రోజు 73 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.. అందులో విదేశీ మార్కెట్లలోనే 26.3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఈ బిజినెస్‌కి రెండో రోజు వసూళ్లు కలిపితే దాదాపు రూ.170 కోట్ల వసూళ్లు రాబట్టవచ్చు. ఈ నేపధ్యంలో సినిమా మొత్తం బిజినెస్ (గ్రాస్ కలెక్షన్స్ కలిపి) రెండో రోజుకి దాదాపు 200 కోట్ల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం.. అధికారిక డేటా విడుద‌ల‌వాల్సిఉంది.

Next Story