వచ్చేసిన 'పూనకాలు లోడింగ్' సాంగ్.. ఎలా ఉందో మీరు చెప్పండి

Waltair Veerayya Poonakaalu Loading Song Release. మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కాంబోలో

By M.S.R  Published on  30 Dec 2022 7:36 PM IST
వచ్చేసిన పూనకాలు లోడింగ్ సాంగ్.. ఎలా ఉందో మీరు చెప్పండి

మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ చేస్తున్నారు. దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి పూనకాలు లోడింగ్ అనే ఈ పాట సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పుడు ఈ మాస్ కూడా ఆ లిస్టు లోకి చేరింది. బాస్, రవి తేజ కూడా తమ గొంతును ఈ పాట కోసం సవరించుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు కాన్సెప్ట్ ను ఇవ్వగా.. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కు కొరియోగ్రఫీ అందించారు.


ఇక పూనకాలు లోడింగ్ పాటను శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు సాంగ్ వివిధ థియేటర్లలో విడుదల చేశారు. హైదరాబాద్ (సంధ్య 70 ఎంఎం), నెల్లూర్ (ఎమ్1 సినిమాస్), అనంతపూర్ (ఎస్‌వీ సినీమ్యాక్స్), రాజమండ్రి (స్వామి), గుంటూర్ (భాస్కర్), విజయవాడ (జైరామ్) థియేటర్లలో సాంగ్ ను విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది.


Next Story