వాల్తేరు వీరయ్య సెకండ్‌ సింగిల్‌.. 'శ్రీదేవి-చిరంజీవి' వచ్చేసింది

Waltair Veerayya - 'Nuvvu Sridevi Nenu Chiranjeevi' lyric video out. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య' .

By M.S.R  Published on  19 Dec 2022 7:15 PM IST
వాల్తేరు వీరయ్య సెకండ్‌ సింగిల్‌.. శ్రీదేవి-చిరంజీవి వచ్చేసింది

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య' . బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు మందుకు రానుంది. తాజాగా మేకర్స్‌ ఈ మూవీ సెకండ్‌ సింగిల్‌ రిలీజ్‌ చేసింది. 'శ్రీదేవీ చిరంజీవి' అంటూ సాగే ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించగా.. జస్‌ప్రీట్‌ జాస్జ్‌, సమీరా భరద్వాజ్‌ ఆలపించారు. మంచులో విజువల్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రిలీజైన మొదటి సింగిల్ 'బాస్‌ పార్టీ' సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ పాట కూడా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. రవితేజ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుంది.


సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్, బాస్ పార్టీ లిరికల్ సాంగ్ తో పాటు రవితేజ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అవన్నీ ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశాయి.




Next Story