పునకాలు లోడింగ్‌.. స్టైలిష్‌ లుక్‌లో 'వాల్తేరు వీరయ్య'

Waltair Veerayya New Stylish Look Goes Viral Now. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'వాల్తేరు వీరయ్య'.

By అంజి  Published on  16 Dec 2022 11:36 AM IST
పునకాలు లోడింగ్‌.. స్టైలిష్‌ లుక్‌లో వాల్తేరు వీరయ్య

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 13, 2023న థియేటర్లలో సందడి చేసేందుకు 'వాల్తేరు వీరయ్య' రెడీ అంటున్నాడు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌.. ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. గ్యాప్‌ లేకుండా ఏదో ఒక అప్‌డేట్‌ను ఇస్తూ ఫ్యాన్స్‌తో సినీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌.. ఈ మూవీ నుంచి చిరంజీవి స్టైలిష్‌ లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

చుట్టూ గన్స్‌ మధ్యలో చిరు స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అదిరేటి గాగుల్స్‌ పెట్టుకుని చిరంజీవి స్టన్నింగ్‌ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ పోస్టర్‌ను అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో తాజా లుక్‌తో చిరు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యారు. చుట్టూ గన్స్‌ కనిపిస్తుండటంతో ఈ లుక్‌ ఏ సీన్‌కు సంబంధించింది అయి ఉంటుందా? అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ ఏసీపీ విక్రమ్‌సాగర్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్లు తెగ ఆకట్టుకుంటున్నాయి.

బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌).. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story