చిరంజీవి ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్.. 4కె వెర్షన్‌లో ఆ సినిమా రీరిలీజ్​

Vyjayanthi movies have given good news to Megastar Chiranjeevi fans. మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పింది.

By అంజి  Published on  14 Aug 2022 2:54 PM GMT
చిరంజీవి ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్.. 4కె వెర్షన్‌లో ఆ సినిమా రీరిలీజ్​

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పింది. 'ఇంద్ర' సినిమాను.. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా తీర్చిదిద్ది.. గ్రాండ్‌గా మళ్లీ రిలీజ్‌ చేయబోతున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ''డియర్‌ మెగా ఫ్యాన్స్‌.. ఇంద్ర సినిమాను 4కె వెర్షన్‌లో తీసుకురానున్నాం. అయితే దీనికి కాస్త సమయం పడుతుంది. ఆ రోజు కోసం మీరే కాదు మేం కూడా ఎదురుచూస్తున్నాం. ఏది ఏమైనా ఇంద్ర సినిమా రీ రిలీజ్‌ గ్రాండ్‌ లెవల్‌లో జరుగుతుందని'' అని ట్విటర్‌లో పేర్కొంది.

వైజయంతి మూవీస్‌ ట్వీట్‌పై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సడెన్‌ ట్వీట్‌పై స్పందిస్తూ అభిమానులు ధన్యవాదాలు చెబుతున్నారు. చిరంజీవి కెరీర్‌లో 'ఇంద్ర' సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. బి.గోపాల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. సోనాలీబింద్రె, ఆర్తి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 20 ఏళ్లు అవుతోంది. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయం సాధించింది.


Next Story