వైవా హ‌ర్ష నిశ్చితార్థం.. ఫోటోలు వైర‌ల్‌

Viva Harsha gets Engaged.యూట్యూబ్ స్టార్, క‌మెడియ‌న్, హోస్ట్ వైవా హ‌ర్ష నిశ్చితార్థం అక్ష‌ర అనే యువ‌తితో శ‌నివారం జరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2021 4:24 AM GMT
viva got engagaed

యూట్యూబ్ స్టార్, క‌మెడియ‌న్, హోస్ట్ వైవా హ‌ర్ష నిశ్చితార్థం అక్ష‌ర అనే యువ‌తితో శ‌నివారం జ‌రిగింది. క‌రోనా నేప‌థ్యంలో వీరి నిశ్చితార్థ వేడుక కేవ‌లం కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మ‌ధ్యే జ‌రిగింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వైవా హ‌ర్ష‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఓ ఫోటోకు 'చివరి బ్యాచిలర్‌ సెల్ఫీ' అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. జీవితాంతం తన‌ వేలు పట్టుకుని నడవనున్న అక్షర మెడలో దండ వేసి సగం పెళ్లి కానిచ్చేశాడు. తర్వాత ఆమెతో కలిసి కేక్‌ కట్‌ చేశాడు.


వైవా హ‌ర్ష నిశ్చితార్థం గురించి తెలిసిన అభిమానులు, ప‌లువురు సెల‌బ్రెటీలు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. పెళ్లి తేదీ ఎప్పుడు అన్న‌ది చెప్ప‌లేదు. హ‌ర్ష ముందుగా యూట్యూబ్ వీడియోలతో చాలా ఫేమ‌స్ అయ్యాడు. ఆ త‌రువాత హోస్ట్‌గా మారి.. పలువురు సెల‌బ్రిటీల‌ని ఫ‌న్నీగా ఇంట‌ర్వ్యూ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ప‌లు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చివ‌రిగా క‌ల‌ర్ ఫొటో అనే సినిమా చేశాడు. ఇందులో త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించాడు.
Next Story