గత సంక్రాంతికి విడుదల కావాల్సిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా పలు కారణాల వలన ఆలస్యం అవుతూనే వస్తోంది. కొద్దిరోజుల పాటూ నిర్మాతలు ఎలాంటి విడుదల తేదీని ప్రకటించలేదు. ఈ సినిమా విడుదలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర సినిమా నిర్మాతలు జూలైలో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జూలై 10 లేదా జూలై 24న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
ఈ సినిమా జూలై 24న రావాలని మెగా అభిమానులు కోరుతూ ఉన్నారు. అందుకు ముఖ్య కారణం చిరంజీవి ఐకానిక్ ఇండస్ట్రీ హిట్ ఇంద్ర (2002) విడుదలైంది ఆ రోజే. కాబట్టి, విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వీలైనంత త్వరగా వస్తే మేలు అని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.
ఇక మల్లిడి వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, రమ్య పసుపలేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది.