లైలా బాయ్‌కాట్ ట్రెండ్..సారీ చెప్పిన హీరో, సినిమాను చంపేయొద్దని విజ్ఞప్తి

లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దానిపై విశ్వక్‌సేన్‌, నిర్మాత సాహు గారపాటి ప్రెస్‌మీట్‌ నిర్వహించి, వివరణ ఇచ్చారు.

By Knakam Karthik  Published on  10 Feb 2025 4:59 PM IST
Cinema News, Tollywood, Entertainment, Laila Movie, Vishwaksen

లైలా బాయ్‌కాట్ ట్రెండ్..సారీ చెప్పిన హీరో, సినిమాను చంపేయొద్దని విజ్ఞప్తి

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దానిపై విశ్వక్‌సేన్‌, నిర్మాత సాహు గారపాటి ప్రెస్‌మీట్‌ నిర్వహించి, వివరణ ఇచ్చారు. పృథ్వీ వ్యాఖ్యలపై హీరో విశ్వక్‌సేన్ స్పందించారు. ‘పృథ్వీ వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా.. మాది సినిమా ఈవెంట్‌.. రాజకీయాలు మాట్లాడకూడదు.. దయచేసి మా సినిమాను చంపేయకండి.. నాకు రాజకీయాలు మాట్లాడేంత అనుభవం లేదు’’ అని విశ్వక్‌సేన్ విజ్ఙప్తి చేశారు. సినిమాలో మేం అలాంటి సన్నివేశం పెట్టలేదు. ఆయన మాట్లాడిన దానికి, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మీద కోపం మా సినిమాపై చూపించడం భావ్యమా? సినిమా విడుదలకాక ముందే చంపేయకండి. అంత చులకనగా చూడకండి’’ అని విజ్ఞప్తి చేశారు.

కాగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ..మేకల సత్యం దగ్గర మొదట 150 మేకలు ఉన్నాయని.. ఇక గ్యాప్ ఇచ్చి లెక్కిస్తే కరెక్ట్గా 11 ఉన్నాయని’ పృథ్వీ కామెంట్స్ చేశాడు. దీంతో పృథ్వీ తమను ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని.. వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జరిగిన 2024 ఎన్నికల ఫలితాలను ఉద్దేశించే తరచూ పృథ్వీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. 150 గొర్రెలు, 11 గొర్రెలు అంటూ పృథ్వీ చేసిన పొలిటికల్ కామెంట్స్‌కి హర్ట్ అయిన వైసీపీ నేతలు బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో భయాందోళన చెందిన విశ్వక్‌సేన్ స్పందించి క్షమాపణ చెప్పారు.

కాగా, లైలా చిత్రానికి రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈనెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి ముఖ్య అతిథిగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. చిరంజీవితో పాటు దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పెషల్‌ గెస్ట్‌గా హాజరయ్యారు.

Next Story