యూట్యూబర్‌తో విశ్వక్ సేన్ గొడవ.. అస‌లేం జ‌రిగిందంటే..

సోషల్ మీడియాలో సాధారణంగా అభిమానుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే హీరోలు గొడవకు దిగితే మాత్రం ఊహించని విధంగా జనంలోకి ఆ గొడవ వెళ్ళిపోతుంది

By Medi Samrat  Published on  19 Jun 2024 9:00 PM IST
యూట్యూబర్‌తో విశ్వక్ సేన్ గొడవ.. అస‌లేం జ‌రిగిందంటే..

సోషల్ మీడియాలో సాధారణంగా అభిమానుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే హీరోలు గొడవకు దిగితే మాత్రం ఊహించని విధంగా జనంలోకి ఆ గొడవ వెళ్ళిపోతుంది. బార్బెల్ పిచ్ మీటింగ్స్ అనే యూట్యూబ్ రివ్యూయర్‌తో టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ గొడవకు దిగాడు. ఈ యూట్యూబర్ తరచుగా తన యూట్యూబ్ ఛానెల్‌లో సినిమాల గురించి విశ్లేషణలు ఇస్తూ ఉంటాడు. అతను ఇటీవల కల్కి 2898 AD గురించి విశ్లేషణను పోస్ట్ చేశాడు. ఇది విశ్వక్ సేన్‌ను యూట్యూబర్‌తో గొడవకు దిగేలా చేసింది, ఇది ఇంటర్నెట్‌లో కూడా ట్రెండ్ అయింది.

యూట్యూబర్ కల్కి 2898 ADని కొన్ని హాలీవుడ్ చిత్రాలతో పోల్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ విమర్శలు గుప్పించారు. సినిమాల పరాజయాలకు ఇలాంటి రివ్యూవర్లను నిందిస్తూ విశ్వక్ సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబర్‌కు రిప్లై ఇచ్చారు. ఇన్ని మాటలు చెప్పేవారు 10 నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ తీయమని సవాలు చేశాడు. దీనికి యూట్యూబర్ స్పందిస్తూ చాలా మంది నటీనటులు తమ సినిమాల ప్రమోషన్ల కోసం రివ్యూయర్లపై ఆధారపడతారని.. తాను సినిమాలు బాగుండాలనే అనుకుంటానని.. విశ్వక్ సేన్‌ను ట్రోల్ చేశాడు. ఇప్పుడు ఈ గొడవ గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటూ ఉన్నారు. యూట్యూబర్ దే తప్పని కొందరు అనగా.. విశ్వక్ సేన్ చిన్న చిన్న క్లిప్ లను చూసి యూట్యూబర్ పై విరుచుకుపడడం కరెక్ట్ కాదన్నారు.

Next Story