విశ్వక్ సేన్ 'ధమ్కీ' రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్ న‌టిస్తున్న ధ‌మ్కీ చిత్రం మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2023 1:41 PM IST
Dhamki Release Date, Vishwak Sen

విశ్వక్ సేన్

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్ న‌టిస్తున్న చిత్రం 'ధ‌మ్కీ'. నివేదా పేతురాజ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్ర విడుద‌ల తేదీ ఖ‌రారైంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ బాష‌ల్లో మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. విశ్వక్‌సేన్‌ ఓ వైపు ఎంజాయ్ మూడ్‌లో కనిపిస్తూ మరోవైపు ధమ్‌ కీ ఇస్తున్నట్టుగా ఉన్న డిఫరెంట్ లుక్స్ ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

వాస్త‌వానికి ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది. అయితే.. సీజీ వ‌ర్స్క్ పెండింగ్ కార‌ణంగా విడుద‌లను వాయిదా వేస్తున్న‌ట్లు అప్ప‌ట్లో చిత్ర బృందం ప్ర‌క‌టించింది. తాజాగా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా విశ్వ‌క్ సేనే. రావు రమేశ్, పృథ్విరాజ్‌,హైపర్‌ ఆది కీలక పాత్రల్లో న‌టిస్తుండ‌గా లియోన్‌ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Next Story