అభిమానుల‌కు షాకిచ్చిన స‌మంత‌, విశ్వ‌క్‌సేన్‌.. ఇలా చేశారు ఏమిటీ..?

Dhamki and Shaakuntalam Release Date Gets Postponed.సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఫిబ్ర‌వ‌రి 17 కోసం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Feb 2023 7:47 AM GMT
అభిమానుల‌కు షాకిచ్చిన స‌మంత‌, విశ్వ‌క్‌సేన్‌.. ఇలా చేశారు ఏమిటీ..?

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఫిబ్ర‌వ‌రి 17 కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున ప‌లు ఇంట్రెస్టింగ్ చిత్రాలు విడుద‌ల కానుండ‌మే అందుకు కార‌ణం. అందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'శాకుంత‌లం'చిత్రం ఒక‌టి కాగా.. యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ న‌టించిన 'ధ‌మ్కీ' సినిమా ఇంకొటి. అయితే.. ఈ రెండు చిత్రాలు వాయిదా వేస్తున్న‌ట్లు ఆయా చిత్ర బృందాలు కొద్ది సేప‌టి క్రితం వెల్ల‌డించాయి. దీంతో అభిమానులు ఎంతో నిరాశ‌కు గురి అవుతున్నారు.

త్వ‌ర‌లోనే కొత్త తేదీతో వ‌స్తాం..

మేము ఈ విష‌యాన్ని మీకు తెలియ‌జేయుట‌కు చాలా చింతిస్తున్నాం. శాంకుత‌లం చిత్రం ఈ నెల 17న విడుద‌ల కావ‌డం లేదు. కొత్త తేదీని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. మీ అంద‌రి అభిమానం, ఆద‌ర‌ణ కృత‌జ్ఞ‌త‌లు అంటూ సోష‌ల్ మీడియాలో చిత్ర బృందం ట్వీట్ చేసింది.

Advertisement

శాకుంత‌లం మ‌ళ్లీ వాయిదా ప‌డింద‌ని తెలిసి మా గుండె ప‌లిగింది. అయిన‌ప్ప‌టికీ.. మేము ఈ చిత్రాన్ని తెర‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆస‌క్తితో ఎదురుచూస్తుంటాం అని ఓ అభిమాని స‌మంత‌కు ట్వీట్ చేశాడు. ఈ చిత్రం మీ అంచ‌నాల‌ను ఖ‌చ్చితంగా అందుకుంటుంద‌ని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను అంటూ స‌మంత రిప్లై ఇచ్చింది.

Advertisement

సీజీ వ‌ర్క్ పూర్తి కాలేదు.

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ధమ్కీ'. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే.. అనుకున్న టైమ్‌లో సీజీ వ‌ర్క్ కంప్లీట్ కాలేద‌ని, ఇంకా కొంచెం పెండింగ్‌లో ఉంద‌ని ఈ కార‌ణం చేత సినిమాను ఫిబ్ర‌వ‌రి 17కు విడుద‌ల చేయ‌డం లేద‌ని చిత్ర‌బృందం తెలియ‌జేసింది. కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది.

ఈ రెండు చిత్రాల‌పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉండ‌గా.. ఈ రెండు సినిమాలు వాయిదా ప‌డ‌డం ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌కు గురి చేసింది.

Next Story
Share it