'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం కొనసాగుతోంది. హీరో విశ్వక్‌సేన్ సారీ చెప్పారు. అయినా వైసీపీ ఫ్యాన్స్ తగ్గడం లేదు. 'వేదికపై పృథ్వీరాజ్ మాట్లాడేటప్పుడు మేం లేం. ఉండి ఉంటే వెంటనే మైక్ గుంజుకునేవాడిని. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ వరుస ట్వీట్లు వేశారు. హెచ్‌డీ ప్రింట్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఒకరు చేసిన తప్పుకు మేం ఎందుకు బలి కావాలి? ఆయన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. మా మూవీని చంపేయొద్దు' అని విజ్ఞప్తి చేశారు. అయితే పృథ్వీరాజ్‌తో క్షమాపణలు చెప్పించాలని వైసీపీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
115k+ ట్వీట్లతో #Boycottlaila ఇంకా ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది. మరి దీనిపై మరోసారి మూవీ టీమ్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లలోకి రానుంది. 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. 'మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. మొదట 150 మేకలు ఉన్నాయని చెప్పారు. చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే కరెక్ట్‌గా 11 ఉన్నాయి' అని తెలిపారు. దీంతో వైసీపీని ట్రోల్ చేశారని ఆ పార్టీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు.