విరాట‌ప‌ర్వం మూవీ అప్‌డేట్

Virataparvam new poster.ద‌గ్గుబాటి రానా హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'.వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2021 8:18 AM GMT
Virataparvam poster

ద‌గ్గుబాటి రానా హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రానా స‌ర‌సన సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. న‌క్స‌ల్ బ్యాగ్రౌండ్‌లో వ‌స్తోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌లు పోషించారు. సంక్రాంతి సందర్భంగా చిత్రబృందం మరో పోస్టర్‌ను విడుదల చేసింది. రానా, సాయిపల్లవి కలిసి నవ్వుకుంటూ నడుస్తున్న పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. వేసవిలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు పోస్టర్‌లో ప్రకటించారు. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ఇందులో న‌క్స‌లైట్ అయిన రానాకి.. ఆయ‌న చేసే ఉద్యమానికి మ‌ద్ద‌తిస్తూ ఆయ‌న్ని ప్రేమించే అమ్మాయిగా సాయి ప‌ల్ల‌వి క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 1990లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న నేప‌థ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నాడు దర్శకుడు వేణు. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం.


Next Story
Share it