టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవి చూసింది. ఆ మ్యాచ్ తర్వాత బౌలర్ షమీపై ఆన్‌లైన్ లో విపరీతమైన ట్రోలింగ్ సాగింది. మతం ఆధారంగా కూడా తీవ్రంగా విమర్శించారు. ఈ విమర్శలు, ఆన్‌లైన్ ట్రోల్స్ పై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. మీడియాతో మాట్లాడిన కోహ్లీ ట్రోలింగ్‌కు షమీ బాధితుడయ్యాడని.. తమ జట్టు ఆ బౌలర్‌కు అండగా ఉందన్నాడు. ఓ వ్యక్తిని మతం ఆధారంగా టార్గెట్ చేయడం విషాదకరమని అన్నాడు కోహ్లీ. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉందని, కానీ మతం ఆధారంగా వివక్ష చూపడం తాను అసలు ఇష్టపడనని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
మహమ్మద్ షమీ భారత్ ను ఎన్ని మ్యాచ్‌లను గెలిపించాడో ట్రోలర్స్‌కు తెలియదని అన్నాడు. అతని పట్టుదలపై అవగాహన లేని వారు ఏదో అంటారని.. అలాంటి వారిపై ఒక నిమిషం కూడా ఆలోచించమని తెలిపాడు కోహ్లీ. 200 శాతం షమీ వెంట తాము ఉన్నామని, మా సోదరభావాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరని కోహ్లీ అన్నాడు. ఆన్‌లైన్ ట్రోల్స్ చేస్తున్న వారు వెన్నుపూసలేని వ్యక్తులని, పరిస్థితులకు అనుగుణంగా ఆటగాళ్లు రాణిస్తారన్నాడు. న్యూజిలాండ్ తో టీమిండియా దుబాయ్ వేదికగా ఆదివారం (అక్టోబర్ 31) జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. భారత్ పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడంతో కివీస్ తో మ్యాచ్ ఎంతో కీలకమైంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.