టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్‌గా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణుకథ'. ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నాడు. జీఏ2 పిక్సర్స్ బ్యానర్‌పై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తుండగా, ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కశ్మీరా పరదేశీ.. ఈ మూవీలో కిరణ్‌కు జోడీగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక బిగ్ అప్‌డేటకు బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రేపు చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. రేపు సాయంత్రం 05.02 గంటలకు సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఈ సినిమా పూర్తిగా విలేజ్ డ్రామా నేపథ్యంలో సాగనుంది. సినిమా రిలీజ్ డేట్ విషయాన్ని వెల్లడిస్తూ ఓ స్పెషల్ వీడియోను కూడా చిత్ర యూనిట్ లాంచ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ఆడలేదు. తాజా సినిమా 'వినరో భాగ్యము విష్ణుకథ'తో ఎలాగైనా హిట్టు కొట్టాలని కిరణ్ అబ్బవరం చూస్తున్నాడు.