సినిమాలకు విరామం ప్రకటించిన ఒక రోజు తర్వాత నటుడు విక్రాంత్ మాస్సే తన ప్రకటనపై వివరణ ఇచ్చాడు. తన పోస్ట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. నటన మాత్రమే నేను చేయగలను. అది నాకు చాలా ఇచ్చింది. నా శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింది. నేను కొంత సమయం విరామం తీసుకోవాలనుకుంటున్నాను, నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నానని విక్రాంత్ తాజా ప్రకటనలో తెలిపారు.
'12th ఫెయిల్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే తన నటనకు తాత్కాలిక రిటైర్మెంట్ ఇస్తున్నట్టు చెప్పాడని మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. 2025 తర్వాత నటన నుంచి విశ్రాంతి తీసుకుంటానని, గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో మంచి విజయాలు దక్కాయని, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమాల నుంచి తాత్కాలికంగా రిటైర్మెంట్‌పై ఆయన చేసిన పోస్ట్ ఇండస్ట్రీని, అభిమానులను షాక్‌కు గురి చేసింది. అయితే తనకు తెలిసింది సినిమాలు మాత్రమే.. కొద్దిరోజులు బ్రేక్ తప్ప మరింకేమీ లేదని విక్రాంత్ వివరణ ఇచ్చారు.