బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు విక్ర‌మ్ గోఖ‌లే మ‌ర‌ణ‌వార్త‌ల‌పై స్పందించిన కుమార్తె

Vikram Gokhale daughter rejects actor death rumours.ప్రముఖ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు విక్ర‌మ్ గోఖ‌లే మ‌ర‌ణించారంటూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2022 5:25 AM GMT
బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు విక్ర‌మ్ గోఖ‌లే మ‌ర‌ణ‌వార్త‌ల‌పై స్పందించిన కుమార్తె

ప్రముఖ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు విక్ర‌మ్ గోఖ‌లే మ‌ర‌ణించారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌లు వైబ్ సైట్లు, ఛాన‌ల్స్ ఆయ‌న చ‌నిపోయారంటూ పేర్కొన్నాయి. ఇది నిజ‌మ‌ని న‌మ్మిన బాలీవుడ్ నటులు అజయ్‌ దేవ్‌గణ్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, జావెద్‌ జాఫర్‌ తదితరులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం కూడా తెలియ‌జేశారు.

విక్ర‌మ్ గోఖ‌లే క‌న్నుమూశారు అన్న వార్త‌ల‌పై ఆయ‌న కుటుంబం స్పందించింది. విక్ర‌మ్ చ‌నిపోలేదని, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ఆయ‌న కుమార్తె తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు వెంటిలేట‌ర్ పై చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఆయ‌న కోసం ప్రార్థించాల‌ని ఆమె కోరారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటన్నారు. ఆయ‌న కోలుకుంటున్నారు అనుకున్న స‌మ‌యంలో కోమాలోకి వెళ్లిపోయారు.

ప్ర‌ముఖ మ‌రాఠీ థియేట‌ర్‌, సినిమా ఆర్టిస్ట్‌చంద్ర‌కాంత్ గోఖ‌లే కుమారుడే విక్ర‌మ్ గోఖ‌లే. సంజయ్ లీలా బన్సాలీ రొమాంటిక్ మూవీ 'హమ్ దిల్‌దే చుకే సనమ్' (1999), కమల హాసన్ సినిమా 'హే రామ్', 'భూల్ భులైయా' (2007), 'దే దనాదన్ (2009), 'మిష‌న్ మంగ‌ళ్‌' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఆయ‌న‌ నటించారు.

Next Story
Share it