బాహుబలి రైటర్.. పవన్ కళ్యాణ్ కోసం పవర్ ఫుల్ స్టోరీ

Vijayendra Prasad’s powerful script for Pawan Kalyan.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 6:33 AM GMT
బాహుబలి రైటర్.. పవన్ కళ్యాణ్ కోసం పవర్ ఫుల్ స్టోరీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సరైన కథ దొరకాలే కానీ రికార్డుల బ్రేక్ తప్పనిసరి. కొన్ని కొన్ని సార్లు ఎన్నో అంచనాలు ఉన్న సినిమాలలో కథ సరిగా లేకపోవడం వలన బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ ఫుల్ కథ ఉండేలా చూసుకుంటూ ఉన్నారు. రీమేక్ చేసినా కూడా కథ మాత్రం తన స్టార్ డమ్ కు తగ్గట్టుగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేశారు. బాహుబలి లాంటి గొప్ప కథను సినీ అభిమానులకు అందించిన విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం కథను రెడీ చేశారట. తనకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని గతంలోనే విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇప్పుడు ఆయన కోసం కథను రెడీ చేయడం.. ఏ జానర్ కు తగ్గ కథను రెడీ చేసి ఉంటారన్నది తెలియాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ కథని సిద్ధం చేశారట విజయేంద్ర ప్రసాద్. ఈ కథను ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని కలసి చెప్పటం జరిగిందని.. పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పాసారని అంటున్నారు. కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ రాసిన ప్రతి కథనూ రాజమౌళి తెరకెక్కించలేరు కదా.. అంతేకాకుండా రాజమౌళి ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథకి న్యాయం చేస్తూ పవన్ స్టార్డమ్ కు తగ్గట్టుగా దర్శకత్వం వహించే వారెవరా అన్నది కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్-విజయేంద్ర ప్రసాద్ కాంబినేషన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా అభిమానులకు కిక్ ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పవన్ కళ్యాణ్-రాజమౌళి కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అని కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.

Next Story
Share it