దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ రెండు రకాలు ఉన్నాయి..అని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్.. ఇలా రెండు రకాలు ఉన్నాయి. నేను A23 అనే గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేశానని క్లారిటీ ఇచ్చా. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో లీగల్. గేమింగ్ యాప్స్‌కి జీఎస్టీ, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయి. నా బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ ఈడీకి సమర్పించా. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా. సంబంధిత కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం వివరాలూ ఈడీకి వెల్లడించా’’ అని విజయ్ దేవరకొండ తెలిపారు.