కన్మణి-కతీజా.. మధ్యలో రాంబో ఏమైపోతాడో..

Vijay Sethupathi Nayanthara Samantha KRK Trailer Released. సీన్ ఓపెన్ చేయగానే.. ఓ దీపం ఆరిపోబోతూ ఉంటుంది. ఇంతలో ఒక చేయి దీపాన్ని ఆరిపోకుండా

By Medi Samrat  Published on  23 April 2022 3:42 PM IST
కన్మణి-కతీజా.. మధ్యలో రాంబో ఏమైపోతాడో..

సీన్ ఓపెన్ చేయగానే.. ఓ దీపం ఆరిపోబోతూ ఉంటుంది. ఇంతలో ఒక చేయి దీపాన్ని ఆరిపోకుండా కాపాడుతుంది.. ఇంతలో హీరో వచ్చి ఆ దీపానికి అడ్డుగా పెట్టిన చేతిని తాకుతాడు.. ఈ సీన్ గురించి వింటే మీకు ఖుషి సినిమా గుర్తుకురావడం చాలా కామన్..! అదే ఇద్దరు అమ్మాయిల చేతులు దీపాన్ని ఆరిపోకుండా అడ్డుపెట్టుకున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి వారి చేతులను తాకితే.. అది 'కె.ఆర్.కె.' సినిమా ట్రైలర్. కన్మణి రాంబో కతీజ (KRK) చిత్రం కాస్టింగ్ కారణంగా వార్తల్లో నిలిచింది.


వినోదంతో కూడిన ఈ రొమాంటిక్ కామెడీలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. KRK ట్రైలర్ ఎంతో ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయింది. కన్మణి (నయనతార)ని వివాహం చేసుకున్న రాంబో (విజయ్ సేతుపతి) కతీజ (సమంత)తో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటాడు. కన్మణి కతీజను కలిసిన తర్వాత కథ కొత్త మలుపు తిరుగుతుంది. KRK లో ఖుషి, టైటానిక్, బాహుబలి యొక్క స్పూఫ్‌లతో కూడా లోడ్ చేయబడింది. కన్మణి రాంబో కతీజ ల మధ్య సన్నివేశాలతో KRK ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అనిరుధ్ సంగీతం అందించగా, 7 స్క్రీన్ స్టూడియో, రౌడీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న తెలుగు-తమిళ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది.

Next Story