విజయ్‌ దేవరకొండ 'VD12' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా 'వీడీ 12' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు.

By అంజి  Published on  2 Aug 2024 12:45 PM IST
Vijay Deverakonda, VD12 movie , Tollywood

విజయ్‌ దేవరకొండ 'VD12' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా 'వీడీ 12' అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ శ్రీలంకలో జరిగింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వర్షంలో తడుస్తూ అగ్రెసీవ్ లుక్‌లో మాములుగా లేదు.

కాగా ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ నుంచి కొన్ని దృశ్యాలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే లీక్‌ అయిన దృశ్యాలను షేర్‌ చేయొద్దని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మూవీలో విజయ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. గ్యాంగ్‌స్టార్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా స్టోరీ సాగనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినీ ప్రియుల్లో మంచి అటెన్షన్‌ను క్రియేట్ చేశాయి. పైగా జెర్సీ తర్వాత గౌతమ్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి.

Next Story