విజయ్ ప‌క్క‌న కూర్చొని ఆయ‌న‌ క్యారెక్టర్‌ను విమ‌ర్శించిన హీరోయిన్‌

Vijay Deverakonda reacts to Ananya Panday being praised for criticising Arjun Reddy. విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలిసి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్‌.

By Medi Samrat  Published on  12 Aug 2022 7:15 PM IST
విజయ్ ప‌క్క‌న కూర్చొని ఆయ‌న‌ క్యారెక్టర్‌ను విమ‌ర్శించిన హీరోయిన్‌

విజయ్ దేవరకొండ, అనన్య పాండే కలిసి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్‌. వీరిద్దరూ కరణ్ జోహార్ పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌కు అతిథులుగా వచ్చారు. అక్కడ అనన్య విజయ్ కు స్టార్డమ్ తెచ్చిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి. విజయ్ పక్కన కూర్చున్నప్పుడే అనన్య అర్జున్ రెడ్డి సినిమాలో హీరో క్యారెక్టర్ ను విమర్శించింది. అంతేకాకుండా.. సినిమాలో ఆడవాళ్లను కొట్టే సీన్స్ కు సంబంధించి స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. అనన్య ఎంతో క్లారిటీతో చెప్పిన మాటలు ఆమెపై సోషల్ మీడియాలో అభిమానుల నుండి ప్రశంసలను సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి సినిమా 2017లో విడుదలైంది. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించారు. 2019లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలతో హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. రెండు సినిమాలు స్త్రీలపై హింసకు సంబంధించి విమర్శలను ఎదుర్కొన్నాయి. కాఫీ విత్ కరణ్‌లో అనన్య మాట్లాడుతూ.. అన్నింటినీ తట్టుకునే అలాంటి మహిళలను తాను ఎప్పుడూ చూడలేదని చెప్పింది.

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య అలా మాట్లాడినందుకు తాను గర్వపడుతున్నానని విజయ్ చెప్పాడు. నేను తన పక్కన ఉన్నప్పుడు సినిమాపై ఆమె చాలా నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెప్పింది. ప్రజల అభిప్రాయాలను వినడం నాకు చాలా ఇష్టం. అన్నివిషయాలలో అందరూ మీతో ఏకీభవించకపోవచ్చు.. నాణేనికి రెండు వైపులా చూడకపోవచ్చు కానీ ఆమె తాను అనుకున్నది మాట్లాడినందుకు నేను సంతోషిస్తున్నానని విజయ్ దేవరకొండ అన్నాడు. విజయ్, అనన్యల చిత్రం లైగర్ ఆగష్టు 25న విడుదల కానుంది. పూరి జగ్గన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'పాన్-ఇండియా' రేంజిలో విడుదలఅవుతోంది. మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌తో పాటు రమ్య కృష్ణన్, మకరంద్ దేశ్‌పాండే తదితరులు నటించారు.


Next Story