విజయ్ దేవరకొండ సినిమా థియేటర్.. ఓపెనింగ్ ఆ సినిమాతోనే
Vijay Deverakonda AVD Cinemas inauguration with Pawan Kalyan Vakeel Saab.సినిమా థియేటర్ల బిజినెస్ లోకి పలువురు
By తోట వంశీ కుమార్ Published on 20 March 2021 1:11 PM ISTసినిమా థియేటర్ల బిజినెస్ లోకి పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబుకు చెందిన సినిమా థియేటర్లు AMB సినిమాస్ హైదరాబాద్ లో మంచి ఆదరణను పొందుతూ ఉన్నాయి. టాప్ సినిమా థియేటర్ల లిస్టులో ఏఎంబీ కూడా చేరిపోయింది. అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ తో ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. అమీర్ పేట సత్యం థియేటర్ ప్లేస్‌లో మల్టీ ప్లెక్స్ నిర్మాణం మొదలై ఇప్పటికే కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు అదే బాటలోనేమరో టాలీవుడ్ హీరో చేరిపోయాడు.
విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు మరో బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని చేస్తున్న విజయ్.. మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏషియన్ సినిమాస్ తో కలసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసాడు విజయ్. మల్టీప్లెక్స్‌కు ఎవిడి సినిమాస్ అని పేరు పెట్టారు. ఇది విజయ్.. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ ఏషియన్ సినిమాస్ మధ్య జాయింట్ వెంచర్‌గా వస్తోంది. ఈ థియేటర్.. ఏప్రిల్ 9 న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ స్క్రీనింగ్‌తో ఏవీడీ సినిమాస్ ప్రారంభంకానుంది.
ఏవీడీ అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.