విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

Vijay Deverakonda and Sreeleela new movie launched. విజయ్ దేవరకొండ 'లైగర్' ఫ్లాప్ నుండి బయటకు వచ్చి వరుసగా సినిమాలు చేసుకుంటూ

By M.S.R  Published on  3 May 2023 8:30 PM IST
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభం

Vijay Deverakonda and Sreeleela new movie launched

విజయ్ దేవరకొండ 'లైగర్' ఫ్లాప్ నుండి బయటకు వచ్చి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని అనుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం సమంతతో కలిసి ‘ఖుషీ’ సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతూ ఉండగా.. మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ‘జెర్సీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ సినిమా ఇప్పటికే ఖరారైంది. విజయ్ దేవరకొండ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. కెరీర్‌లో తొలిసారి విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్ర చేయబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి పలు చర్చలు జరగగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. హీరో హీరోయిన్లపై ముహూర్తపు షాట్‌కి ప్రగతి ప్రింటర్స్ ఎండీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేయగా, హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) తన చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు.


Next Story