బాక్సాఫీసు దగ్గర మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఖుషి
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది.
By Medi Samrat Published on 2 Sept 2023 7:00 PM ISTవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. శుక్రవారం రిలీజైన ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 27 కోట్ల గ్రాస్‌ను 16 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల 90 లక్షల గ్రాస్‌ను, 10 కోట్లకు వరకు షేర్ కలెక్షన్స్ ను ఖుషి మూవీ సొంతం చేసుకుంది. నైజాం ఏరియాలో ఖుషి మూవీకి ఐదున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మొదటి నుండి కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. 'ఖుషి' సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ, రాహుల్ రామకృష్ణ తదితరులు మంచి పాత్రల్లో మెప్పించారు.
ఓవర్‌సీస్‌లో ఖుషి మొదటి రోజు నాలుగున్నర కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్ల అరవై లక్షల వసూళ్లను రాబట్టింది. లైగర్ రికార్డ్‌ను ఖుషి బ్రేక్ చేసింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ మూవీస్‌లో ఒకటిగా ఖుషి నిలిచింది. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 52 కోట్ల వరకు జరిగింది. 53 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. మొదటి రోజునే 16 కోట్ల వరకు వసూళ్లు రావడంతో సినిమా లాభాల బాట పట్టే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు.