యాక్ష‌న్‌+మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా లైగ‌ర్ ట్రైల‌ర్‌.. అదిరిపోయింది

Vijay Devarakonda Liger Trailer Out.టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం లైగ‌ర్‌. పూరీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2022 10:31 AM IST
యాక్ష‌న్‌+మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా లైగ‌ర్ ట్రైల‌ర్‌.. అదిరిపోయింది

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య దేవ‌ర‌కొండ న‌టిస్తున్న చిత్రం 'లైగ‌ర్‌'. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడూ ఈ చిత్రం విడుద‌ల అవుతుందా అని వారంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచేస్తున్నారు. ఈ క్ర‌మంలో గురువారం ఉద‌యం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. 'ఒక లయ‌న్‌కి టైగ‌ర్‌కు పుట్టిండాడు.. క్రాస్ బ్రీడ్ స‌ర్ నా బిడ్డ' అంటూ ర‌మ్య‌కృష్ణ డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది.యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌లో విజ‌య‌దేవ‌ర‌కొండ స్టంట్స్‌, ప్రముఖ బాక్స‌ర్ మైక్‌టైస‌న్‌తో బాక్సింగ్ స‌న్నివేశాలు మాస్‌ని మెప్పించేలా ఉన్నాయి.

ఇక ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే ఈ చిత్రంలో విజ‌య్‌కు న‌త్తి ఉన్న‌ట్లు అనిపిస్తోంది. 'ఐ ల‌వ్ యూ', 'ఐ అమ్ ఎ ఫైట‌ర్' అంటూ న‌త్తితో చెప్పే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫి బాగుంది. మ‌ణిశ‌ర్మ‌ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవ‌ల్లో ఉంది.ట్రైల‌ర్‌తో ఈ చిత్ర అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య‌పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో మ‌థ‌ర్ సెంటిమెంట్‌, కిక్ బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. పూరీ క‌నెక్ట్స్‌, ధ‌ర్మా ప్రొడెక్ష‌న్స్ ప‌తాకంపై చార్మి, క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఆగ‌స్టు 25న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story