లైగర్ 'వాట్ లగా దేంగే' సాంగ్.. విజయ్ రచ్చ మాములుగా లేదుగా

Vijay Devarakonda Liger attitude glimps released. హీరో విజయ్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ 'లైగర్'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై

By అంజి  Published on  29 July 2022 4:20 AM GMT
లైగర్ వాట్ లగా దేంగే సాంగ్.. విజయ్ రచ్చ మాములుగా లేదుగా

హీరో విజయ్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ 'లైగర్'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. నటి ఛార్మి, కరణ్‌ జోహర్ కలిసి, పూరి జగన్నాథ్‌ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో విజయ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌ యూట్యూబ్‌ను షేక్ చేస్తూ.. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. విజయ్‌ 'లైగర్‌' కోసం ఆయన అభిమానులు ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు.

బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. మేకర్స్ వరుస అప్‌డేట్‌లతో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా మేక‌ర్స్ #WaatLagaDenge అనే హాష్‌ట్యాగ్‌తో లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ వీడియోను రిలీజ్‌ చేశారు. సునీల్ క‌శ్య‌ప్ స్వరపరిచిన ఈ పాట‌ను విజ‌య్ దేవరకొండ పాడాడు. పూరి సాహిత్యం అందించాడు. ముంబైలోని ఓ చాయ్‌ వాలా ప్ర‌పంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. ప్ర‌ముఖ బాక్స‌ర్ మైక్ టైస‌న్ కీల‌కపాత్ర‌లో న‌టించాడు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్‌ కానుంది.


Next Story