రాధిక మాథూర్‌ పాత్ర నాది కాదు.. విద్యాబాలన్!

Vidya Balan Said Iam Not First Choice Hum Paanch. బాలీవుడ్ నటి విద్య బాలన్ జనవరి 1 న తన 42 వ పుట్టిన రోజు సందర్భంగా తన మొదటి సీరియల్ పాత్ర హమ్‌ పాంచ్ గురుంచి గుర్తుచేసుకుంది.

By Medi Samrat  Published on  2 Jan 2021 9:26 AM IST
Actress Vidya Balan

బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటన గురించి అందరికీ తెలిసిన విషయమే. జనవరి 1న 42వ పుట్టినరోజు జరుపుకున్న విద్యాబాలన్ కు ఆమె అభిమానులు, బాలీవుడ్ నటీ,నటులు ఆమెకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 2005లో వచ్చిన "పరిణీత" ఈ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన విద్యాబాలన్ పలు సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందారు. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె బుల్లితెరపై 'హమ్‌ పాంచ్‌'‌ అనే సీరియల్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా విద్యాబాలన్ ఆ సీరియల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...

'హమ్‌ పాంచ్‌'‌ సీరియల్ ప్రారంభమైన సంవత్సరం తర్వాత ఈ సీరియల్ లో నటించారు. అయితే విద్యాబాలన్ కన్నా ముందు అమితా నంగియా లీడ్‌రోల్‌ రాధిక మాథూర్‌ పాత్ర పోషించారని విద్యాబాలన్ ఓ సందర్భంలో తెలియజేశారు. ఏడాది తర్వాత నంగియా స్థానంలో నాకు నటించే అవకాశం లభించిందని ఆమె తెలియజేశారు. ఈ సీరియల్ ప్రారంభమైన ఏడాదికే ఎంతో పెద్ద హిట్ అయినప్పటికీ రాధిక మాథూర్‌ పాత్రలో 'హమ్‌ పాంచ్‌'‌ అభిమానులు నన్ను స్వాగతించారని ఆమె తెలిపారు.

ఈ సీరియల్లో నటించక ముందు రెండు యాడ్స్ లో చేశానని,'హమ్‌ పాంచ్‌'‌ సీరియల్లో రాధిక మాథూర్‌ పాత్ర అంటే వారి అమ్మకి ఎంతో ఇష్టమని ఎలాగైనా ఇలాంటి పాత్రలో నన్ను చూడాలని కోరిక అమ్మకు ఉండేది అని తెలిపారు. అయితే ఒకసారి ఈ సీరియల్ లో రాధిక మాథూర్‌ పాత్రలో నటించాలని అనుకుంటున్నారా? అంటూ ఏక్తా విద్యాబాలన్ కు ఫోన్ చేయడంతో ఆనంద పడ్డానని తెలిపారు. ఆ పాత్రలో నటించమని ఆమె అడగ్గానే వెంటనే ఓకే చెప్పారు. ఈ విధంగా హమ్‌ పాంచ్‌ సీరియల్ లో రాధిక మాథూర్‌ చేశానని విద్యాబాలన్ తెలిపారు. ఈ సీరియల్ 1995 లో ప్రారంభం అయ్యి 2006లో పూర్తయింది.




Next Story