దీపికా పదుకొణె వీడియో వైరల్‌.. అలా ప్ర‌యాణించింది..!

Video of Deepika Padukone flying in economy class goes viral. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె విమానంలో బిజినెస్ క్లాస్ ని కాదని ఎకానమీ విభాగంలో

By M.S.R  Published on  17 Feb 2023 5:01 PM IST
దీపికా పదుకొణె వీడియో వైరల్‌.. అలా ప్ర‌యాణించింది..!

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె విమానంలో బిజినెస్ క్లాస్ ని కాదని ఎకానమీ విభాగంలో వెళ్ళిపోయింది. ఒక అభిమాని ఆమెకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. విమానంలో తన బాడీ గార్డును అనుసరించిన దీపిక ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సహ ప్రయాణికులతో ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఆమె సన్ గ్లాసెస్‌తో పాటు క్యాప్‌, నారింజ-నీలిరంగు జాకెట్ ధరించి కనిపించింది.

దీపికా నటించిన తాజా చిత్రం ‘పఠాన్‌’ భారీ హిట్ ను అందుకుంది. షారుక్ ఖాన్‌, దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్లో దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన సినిమా ఇది. జనవరి 25న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఈ శుక్రవారాన్ని (ఫిబ్రవరి 17) ‘పఠాన్‌ డే’గా టీమ్ చెబుతోంది. ఆ ఒక్కరోజు ఐనాక్స్‌, పీవీఆర్‌, సినీపోలిస్‌తో పాటు మరికొన్ని మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధర రూ. 110గా ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది.


Next Story