మెగా స్టార్ చిరంజీవి రికార్డును దాటేసిన విక్టరీ వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను కొనసాగిస్తూ ఉంది. ఈ సినిమా మెగా స్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ ను దాటేసింది.

By అంజి  Published on  26 Jan 2025 5:00 PM IST
Victory Venkatesh, Mega Star Chiranjeevi, Tollywood

మెగా స్టార్ చిరంజీవి రికార్డును దాటేసిన విక్టరీ వెంకటేష్  

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను కొనసాగిస్తూ ఉంది. ఈ సినిమా మెగా స్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ ను దాటేసింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మరియు మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శనివారం నాడు కలెక్షన్స్ లో మంచి జంప్‌ను సాధించింది. బాక్సాఫీస్ వద్ద రెండవ వారాంతంలో కూడా అద్భుతంగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం శనివారం 200 కోట్ల క్లబ్‌లో చేరి మరో మైలురాయిని సాధించింది.

సీనియర్ హీరోల కలెక్షన్స్ రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీద ఉంది. వాల్తేర్ వీరయ్య తెలుగు వెర్షన్ 129 కోట్ల షేర్‌తో చిరంజీవికి అత్యధిక షేర్ సాధించిన చిత్రం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వాల్తేరు వీరయ్య రికార్డును దాటేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సీనియర్ హీరోలలో అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది.చిరంజీవి రికార్డును బ్రేక్ చేసిన మొదటి సీనియర్ గా హీరో వెంకటేష్ నిలిచారు.

Next Story