షూటింగ్‌లో గాయపడిన కత్రినా కైఫ్ భర్త..!
తమ నటనతో పాత్రలకు ప్రాణం పోసే హిందీ సినిమా నటులలో విక్కీ కౌశల్ ఒకరు. ఆయన తెరపైకి కనిపిస్తే చాలు..
By Medi Samrat Published on 8 Feb 2024 2:30 PM ISTతమ నటనతో పాత్రలకు ప్రాణం పోసే హిందీ సినిమా నటులలో విక్కీ కౌశల్ ఒకరు. ఆయన తెరపైకి కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు తమ కళ్లు తిప్పుకోలేరు. 2023లో సామ్ బహదూర్ గా విక్కీ కౌశల్ తెరపై కనిపించాడు. ఆ సినిమాలో తన పాత్రతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అనంతరం పలు కొత్త ప్రాజెక్ట్‌లను చేస్తున్నాడు. విక్కీ కౌశల్ తన రాబోయే చిత్రం షూటింగ్‌లో గాయపడ్డాడు. దీంతో షూటింగ్‌ను వదిలేసిన విక్కీ.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.
విక్కీ కౌశల్ తొలిసారిగా సంజయ్ లీలా బన్సాలీతో కలిసి 'లవ్ అండ్ వార్' చిత్రంలో పని చేయబోతున్నాడు. అంతకు ముందు మల్టీ టాలెంటెడ్ నటుడు లక్ష్మణ్ ఉటర్కర్ చిత్రం 'ఛావా'తో తెరపైకి రానున్నారు. ఇందులో రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తుంది.
అయితే.. ఇటీవల సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ.. విక్కీ కౌశల్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో విక్కీ ఎడమ చేయికి కట్టు కట్టి ఉంది. వీడియోలో కారు దిగి ఇంటి వైపు వెళ్తున్నాడు విక్కీ. నివేదికల ప్రకారం.. 'ఛావా' యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు విక్కీ కౌశల్ ఈ గాయానికి గురయ్యాడని తెలుస్తుంది. గాయం కారణంగా విక్కీ కౌశల్ షూటింగ్ నుండి విరామం తీసుకొని విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తుంది..
విక్కీ కౌశల్ చేతికి ఉన్న ప్లాస్టర్‌ను చూసిన అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఒక నెటిజన్ "వెంటనే కోలుకోండి విక్కీ భాయ్" అని రాశాడు. మరోకరు "విక్కీ భాయ్, టేక్ కేర్" అని రాశారు. మరొక వినియోగదారు "ఓ మై గాడ్.. మీరు మీ చేతిని ఎలా ఫ్రాక్చర్ చేశారు.. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండని రాసుకొచ్చారు. కొంతమంది వ్యంగంగా కూడా స్పందించారు.. కత్రినా భాభినే గాయం చేసి ఉండొచ్చనే ఫన్నీ కామెంట్ కూడా చేశారు.