విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత మురళీధరన్‌ కన్నుమూత

Veteran film producer K Muralidharan passes away. ప్రముఖ సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కె మురళీధరన్ ఇక లేరు. తమిళనాడులోని కుంభకోణంలోని తన

By అంజి  Published on  2 Dec 2022 9:28 AM IST
విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత మురళీధరన్‌ కన్నుమూత

ప్రముఖ సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కె మురళీధరన్ ఇక లేరు. తమిళనాడులోని కుంభకోణంలోని తన స్వగ్రామంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. మురళీధరన్‌ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మురళీధరన్ తమిళ నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తన భాగస్వాములు దివంగత వి స్వామినాథన్, జి వేణుగోపాల్‌లతో కలిసి లక్ష్మీ మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థను మురళీధరన్‌ ప్రారంభించాడు. దీని ద్వారా వారు 'అన్బే శివం', 'పుదుపేట్టై', 'భగవతి' వంటి అనేక పెద్ద హిట్‌ సినిమాలను నిర్మించారు.

లక్ష్మీ మూవీ మేకర్స్ తమిళ సినిమాల్లోని పెద్ద స్టార్స్‌తో కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలను అందించింది. కె మురళీధరన్ కమల్ హాసన్ (అన్బే శివం), విజయకాంత్ (ఉలవతురై), కార్తీక్ (గోకులతిల్ సీతై), అజిత్ (ఉన్నై తేడి), విజయ్ (ప్రియముదన్), ధనుష్ (పుదుపేట్టై), శింబు (సిలంబాట్టం) వంటి సినిమా సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించారు. జయం రవి, త్రిష మరియు అంజలి నటించిన 'సకలకళ వల్లవన్' ఎల్‌ఎమ్‌ఎమ్‌ నిర్మించిన చివరి చిత్రం. ఈ సినిమా 2015 సంవత్సరంలో విడుదలైంది.

నిర్మాత్ మురళీధరన్‌కు సోషల్‌ మీడియా వేదికగా కమల్‌ హాసన్‌ హృదయపూర్వక నివాళులు అర్పించారు. కమల్‌ తమిళంలో ఒక ట్వీట్ రాశాడు. ''అనేక హిట్‌లను అందించిన లక్ష్మీ మూవీ మేకర్స్ నుండి నిర్మాత కె ఇక లేరు. ఆ రోజులు నాకు గుర్తున్నాయి. ఆయనకు నివాళులు'' అని పోస్టు చేశారు. ఇదిలా ఉంటే నటుడు-దర్శకురాడు మనోబాల కూడా "షాకింగ్ షాకింగ్ న్యూస్ ఎల్‌ఎమ్‌ఎమ్‌ మురళి నో మోర్..'' అని ట్వీట్ చేశారు. కె మురళీధరన్ 1994లో శరత్‌కుమార్ నటించిన అరణ్మనై కావలన్ చిత్రంతో నిర్మాతగా మారారు.



Next Story